విక్రమ్ గదిలో నేల మీద కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక కాగితం ఉంది. కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. చేతులు వణుకుతున్నాయి. ఆ ఉత్తరంలోని అక్షరాలు అతని గుండెను ముక్కలు చేస్తున్నాయి. ఆ లెటర్ లో ఇలా రాసి ఉంది
"విక్రమ్... నన్ను క్షమించు. నేను నీతో ఉండలేను. అసలు ఈ పెళ్లి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు నన్ను సుఖపెట్టలేకపోతున్నావు. ఐ యామ్ నాట్ హ్యాపీ విత్ యు. నీతో నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. అందుకే నేను శాశ్వతంగా వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు."
ఆ మాటలు చదవగానే విక్రమ్ గుండె పగిలిపోయింది. కాగితాన్ని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
"అంజలీ... ఏంటిది? ఏంటి ఈ మాటలు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నన్ను సుఖపెట్టట్లేదు అని ఎంత మాట అన్నావే! ఎంత ప్రేమించానే నిన్ను! ఇదంతా అబద్ధం... నా అంజలి నన్ను వదిలి వెళ్లదు..." అని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు.
సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కార్తీక్, తన అన్నయ్య గదిలోంచి వస్తున్న ఏడుపు శబ్దం విని కంగారుగా లోపలికి వచ్చాడు.
"అన్నా... ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్ రా? వదిన ఏది?" అంటూ కంగారుగా విక్రమ్ పక్కన కూర్చున్నాడు కార్తీక్.
విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ తన చేతిలో ఉన్న లెటర్ ని కార్తీక్ చేతిలో పెట్టాడు. ఆ లెటర్ చదివిన కార్తీక్ ముఖంలో రంగులు మారాయి. కళ్లలో ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. నరాలు బిగుసుకున్నాయి.
అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళ అమ్మ భవాని, గదిలో ఏడుపులు విని లోపలికి వచ్చింది.
"ఏంట్రా విక్రమ్... ఎందుకు అలా ఏడుస్తున్నావ్? ఏమైంది?" అంటూ కార్తీక్ చేతిలో ఉన్న ఆ కాగితాన్ని లాక్కుని చదివింది. అది చదవగానే భవాని ముఖంలో ఒక పెద్ద షాకింగ్ ఎక్స్ప్రెషన్. కళ్లు తేలేసింది. క్షణంలో ఆశ్చర్యం కోపంగా మారింది.
వెంటనే ఆ లెటర్ పట్టుకుని హాల్లోకి ఆవేశంగా నడిచింది భవాని.
"ఏమండీ... రామచంద్ర రావు గారూ... ఓ సారి ఇలా రండి! చూశారా మీ స్నేహితుడి కూతురు చేసిన ఘనకార్యం!" అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచింది.
రామచంద్ర రావు గారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు విక్రమ్, చిన్నవాడు కార్తీక్. పదేళ్ల క్రితం తన ప్రాణస్నేహితుడు చనిపోతే, దిక్కులేని ఆ పిల్లలకి తనే అండగా నిలబడాలి అనుకుని, తన స్నేహితుడి ఇద్దరు కూతుర్లు అయిన అంజలి, పల్లవిలను తన ఇంటికే తీసుకొచ్చి సొంత కూతుర్లలా పెంచుకున్నారు రామచంద్ర రావు. అలా ఇంట్లోనే పెరిగిన అంజలిని, తన కొడుకు విక్రమ్ కి ఇచ్చి సరిగ్గా నెల రోజుల క్రితమే ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. అంతా సంతోషంగా ఉన్నారనుకుంటున్న సమయంలో, ఆఫీస్ పని మీద కలకత్తా వెళ్లిన అంజలి, ఇప్పుడు ఈ లెటర్ రాసి ఇంట్లో అగ్గి రాజేసింది.
కంగారుగా బయటికి వచ్చిన రామచంద్ర రావుతో భవాని చేతిలోని లెటర్ విసిరికొడుతూ ఇలా అంది.
"నీ స్నేహితుడి కూతుర్లు అని చెప్పి ఎంతో ప్రేమగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఆ పెద్దది ఏం చేసిందో చూడు! నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి లేచిపోయింది! అది కూడా ఏమని రాసిందో తెలుసా... నా కొడుకు దాన్ని సుఖపెట్టట్లేదు అంట... ఛీ... ఎంత దరిద్రపు ఆలోచనలు దానికి! ఇలాంటి దాన్ని తెచ్చి నా కొడుకు నెత్తిన రుద్దావు కదా, ఇప్పుడు వాడి జీవితానికి ఎవరు సమాధానం చెప్తారు?" అని నిలదీసింది భవాని.
ఆ లెటర్ చదివిన రామచంద్ర రావు గారు కూడా ఒక క్షణం ఏమనాలో అర్థం కాలేదు. ఎందుకిలా చేసింది అన్న ఆలోచనతో తల పట్టుకుని కుర్చీలో కూలబడిపోయారు.
"నాకు ఏమనాలో అర్థం కావడం లేదు భవానీ... ఈ అమ్మాయి ఎంత పని చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నా పరువు మట్టిలో కలిపేసింది," అంటూ ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదంతా చూస్తున్న కార్తీక్ రక్తం మరిగిపోయింది. "దీనికంతటికీ వాళ్ల చెల్లి పల్లవికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది. మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన వాళ్లకి ఈరోజు నరకం చూపిస్తాను," అని మనసులో గట్టిగా అనుకుని, విక్రమ్ కి ఏమీ చెప్పకుండా వేగంగా కారు వేసుకుని పల్లవి కాలేజీకి వెళ్ళాడు.
సాయంత్రం కాలేజీ వదిలే టైం కావడంతో స్టూడెంట్స్ అందరూ బయటికి వస్తున్నారు. పల్లవి కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ బయటికి వస్తోంది. పల్లవిని చూడగానే కార్తీక్ కళ్లు కోపంతో ఎర్రబడ్డాయి. వేగంగా వెళ్లి కారు ఆపాడు. లోపలినుంచి దిగి ఆవేశంగా పల్లవి దగ్గరికి వెళ్ళాడు.
కార్తీక్ ని చూడగానే పల్లవి ఆశ్చర్యంగా, "బావా... ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగింది.
కార్తీక్ ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని కారు వైపు లాగడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల కాలేజీ స్టూడెంట్స్ అందరూ విచిత్రంగా చూస్తుండటంతో పల్లవికి ఇబ్బందిగా అనిపించింది.
"బావా... చెయ్యి వదులు బావా, బాగా నొప్పిగా ఉంది. నేనే వచ్చి కారులో కూర్చుంటాను కదా, ఎందుకలా లాగుతున్నావు?" అని నెమ్మదిగా అంది.
కార్తీక్ ఆ కోపాన్ని పంటి కింద బిగబట్టి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారని ఏమీ మాట్లాడకుండా ఆమెను కారులో కూర్చోబెట్టి, డోర్ వేసి వేగంగా కారు స్టార్ట్ చేశాడు.
కారు వేగంగా వెళ్తుంటే పల్లవికి భయం వేసింది.
"బావా... అసలు ఏమైంది? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో వదిలేయ్ బావా," అని వణుకుతున్న గొంతుతో అడిగింది.
అప్పటివరకు అణచుకున్న కార్తీక్ కోపం కట్టలు తెంచుకుంది. స్టీరింగ్ ని గట్టిగా కొడుతూ అరిచాడు.
"ఏమైంది అంటావేంటి? మీ అక్క మా అన్నయ్యను వదిలేసి లేచిపోయింది!"
ఆ మాట వినగానే పల్లవి గుండె ఆగిపోయినంత పని అయింది. "అదేంటి బావా... అక్క... అక్క అలా ఎందుకు చేస్తుంది?" అని ఏడుస్తూ అడిగింది.
కార్తీక్ కళ్లు ఎర్రబడ్డాయి, కసిగా పల్లవి వైపు చూస్తూ, "ఎందుకు చేస్తుందా? మా అన్నయ్య మీ అక్కను సుఖపెట్టట్లేదంట! అందుకే ఇంట్లోంచి పారిపోయింది. రా... దానికి బదులుగా ఈరోజు నిన్ను నేను సుఖ పెడతాను!" అంటూ భయంకరంగా అరిచాడు.
ఆ మాటలకి పల్లవి వణికిపోయింది. "నిజంగా నాకు తెలియదు బావా! మా అక్క ఎక్కడికి వెళ్లిందో, ఏం చేసిందో నాకు ఏమీ చెప్పలేదు. దయచేసి నన్ను వదిలేయ్ బావా... నేను ఏ తప్పూ చేయలేదు, నేనే పాపం ఎరుగను," అని రెండు చేతులు జోడించి కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తూ బతిమాలింది పల్లవి.
కానీ కార్తీక్ ఆమె మాటలు ఏమాత్రం వినలేదు. కారుని నేరుగా ఊరి చివర ఉన్న ఒక గుడి దగ్గరికి తీసుకెళ్లాడు. వర్షం పడుతున్నా పట్టించుకోకుండా పల్లవిని మెట్ల మీద నుంచి గుడిలోకి లాక్కెళ్లి, దేవుడి ముందు ఉన్న పసుపుతాడు తీసుకున్నాడు. పల్లవి ఎంత ఏడుస్తూ గింజుకుంటున్నా వినకుండా, బలవంతంగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. పల్లవి గుండెలు బాదుకుంటూ దేవుడి ముందు అక్కడే నేల మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది.
బయట వర్షం ఆగిపోయింది కానీ పల్లవి మనసులో మాత్రం కన్నీటి తుఫాను ఉప్పొంగుతూనే ఉంది. గుడిలో దేవుడి సాక్షిగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా మెడలో తాళి పడిన క్షణం నుంచి ఆమెకు ఊపిరి ఆడటం లేదు. కార్తీక్ కారు వేగంగా వాళ్ళ ఇంటి వైపు దూసుకుపోతోంది. కారులో భయంతో వణికిపోతూ ఒక మూల ముడుచుకుని కూర్చుంది పల్లవి. కార్తీక్ కళ్లలో రగిలిపోతున్న కోపం స్పష్టంగా కనిపిస్తోంది.
పల్లవి నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుంటూ, భయంగా కార్తీక్ వైపు చూసింది. "బావా... ఎందుకిలా చేశావు? నాకే పాపం తెలియదే... నా జీవితం ఎందుకు నాశనం చేశావు?" అని వణుకుతున్న గొంతుతో అడిగింది.
కార్తీక్ స్టీరింగ్ ని గట్టిగా పట్టుకుని, కసిగా ఆమె వైపు చూశాడు. "నా అన్నయ్య జీవితం నాశనం చేసిన మీ కుటుంబానికి సంతోషంగా ఉండే అర్హత లేదు. మీ అక్క చేసిన ద్రోహానికి నువ్వే బలి కావాలి. నీ నరకం ఇప్పుడే మొదలైంది పల్లవీ," అని కఠినంగా అన్నాడు.
కారు ఇంటికి చేరుకోగానే పల్లవి చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కుంటూ లోపలికి వెళ్లాడు. హాల్లో ఉన్న వాళ్ళ అమ్మ భవాని, పల్లవి మెడలో ఉన్న పసుపుతాడు చూడగానే అగ్గిమీద గుగ్గిలం అయింది.
"ఒరేయ్ కార్తీక్... ఏంట్రా ఇది? వీళ్ల అక్కే మన పెద్దోడి జీవితాన్ని నాశనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ దరిద్రాన్ని తీసుకువచ్చి తాళి కట్టావా? దీన్ని నేను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. గెట్ అవుట్!" అంటూ పల్లవి మీదకు దూసుకెళ్లింది భవాని. పల్లవి భయంతో కార్తీక్ వెనక్కి దాక్కుంది.
కార్తీక్ అడ్డుపడి, స్థిరమైన గొంతుతో అన్నాడు, "అమ్మా... ఆగు! దీన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. మా అన్నయ్య కళ్ళలో నీళ్లు చూసినప్పుడే నా మనసులో పగ రగిలింది. దానికి బదులు తీర్చుకోవడానికే ఈ తాళి కట్టాను. సరేలే అమ్మా, ఇది ఇక్కడ ఉండదులే, నేను దీన్ని ఇక్కడ ఉంచుతామని కూడా అనుకోవట్లేదు. ఇది నా దగ్గరే ఉండాలి, నా కళ్లెదురుగా నరకం అనుభవించాలి!" అని చాలా కోపంగా అన్నాడు.
అది విన్న భవాని, "అదేంట్రా... అలా వెళ్ళిపోతాను అంటున్నావు?" అని అరిచింది.
కార్తీక్ మాటలు వింటున్న పల్లవి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 'ఏంటిది... వీళ్లు ఏం మాట్లాడుతున్నారు? నన్ను ఏం చేస్తాడు? ఎక్కడికి తీసుకువెళ్తాడు?' అని భయంతో వణికిపోతూ చూస్తోంది.
సరిగ్గా అప్పుడే లోపలి నుంచి వాళ్ళ నాన్న రామచంద్ర రావు, వెనకే విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. పల్లవి మెడలో తాళి చూడగానే ఇద్దరూ షాక్ అయ్యారు. "ఏం చేశావురా కార్తీక్? ఈ చిన్న పిల్ల జీవితంతో ఎందుకు ఆడుకున్నావు?" అని విక్రమ్, రామచంద్ర రావు గట్టిగా అడిగారు.
కార్తీక్ ఏమాత్రం తడబడకుండా, భయంతో మూలకి నక్కిన పల్లవిని అందరి ముందుకు లాక్కొచ్చాడు. ఆమె నడుమును తన చేత్తో చాలా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. ఆ పట్టుకి పల్లవికి ప్రాణం పోతున్నంత నొప్పిగా ఉంది. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
ఆ నొప్పిని భరిస్తున్న పల్లవి కళ్లలోకి కసిగా చూస్తూ, "ఏం పల్లవీ... నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? చెప్పు..." అని నొక్కి అడిగాడు.
అతని కోపం, భయపెడుతున్న విధానం చూసి పల్లవికి వణుకు పుట్టింది. ఏం మాట్లాడితే ఏం చేస్తాడో అన్న భయంతో కన్నీళ్లు కారుస్తూనే వణుకుతూ 'ఇష్టమే' అన్నట్టుగా తల ఊపింది.
అది చూసి కార్తీక్ నవ్వుతూ, "చూశారు కదా... నా భార్యకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. అయినా ఇది మైనర్ కాదు, 19 ఏళ్లు వచ్చాయి. నేను ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు," అని పొగరుగా చెప్పాడు.
ఇదంతా చూస్తున్న విక్రమ్ కి గుండె తరుక్కుపోయింది. 'నా మీద ఉన్న ప్రేమతో నా భార్య చేసిన తప్పుకి ఈ చిన్నపిల్లకు, వాళ్ల చెల్లికి ఎంత పెద్ద శిక్ష వేస్తున్నాడు రా దేవుడా' అని మనసులో కుమిలిపోయాడు.
మెల్లగా కార్తీక్ దగ్గరికి వచ్చి, "సరేరా... తీసుకెళ్తే తీసుకెళ్లు, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోరా. చిన్న పిల్ల... జస్ట్ 19 ఏళ్లు దానికి, కొంచెం చూసుకోరా," అని నెమ్మదిగా, బాధగా చెప్పాడు విక్రమ్. దానికి కార్తీక్ ఏమీ బదులివ్వకుండా పల్లవిని తీసుకుని బయటికి నడిచాడు.
ఆ రాత్రికే పల్లవిని తీసుకుని వేరే ఇంటికి కాపురం వెళ్ళిపోయాడు కార్తీక్. ఆ కొత్త ఇల్లు పల్లవికి ఒక జైలులా అనిపించింది.
రాత్రి పది గంటలు అవుతోంది. బెడ్ రూమ్ లో ఒక మూల నిలబడి భయంతో వణికిపోతోంది పల్లవి. తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు కార్తీక్. వస్తూనే గడియ పెట్టాడు. ఆ శబ్దం వినగానే పల్లవి గుండె వేగం పెరిగింది. కార్తీక్ నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేస్తుంటే, పల్లవి భయంతో వెనక్కి వెనక్కి వెళ్తూ గోడకు ఆనుకుని ఆగిపోయింది.
"బావా... వద్దు బావా... ప్లీజ్... నా దగ్గరికి రావొద్దు... నాకు చాలా భయంగా ఉంది..." పల్లవి గొంతు వణుకుతోంది. కళ్లెంబడి నీళ్లు ధారగా కారుతున్నాయి.
కార్తీక్ కళ్లలో ఏమాత్రం జాలి లేదు. నేరుగా వెళ్లి ఆమె రెండు చేతులనూ గట్టిగా పట్టుకుని గోడకు అదిమిపెట్టాడు. "బావ ఏంటే? మొగుడ్ని. మీ అక్క మా అన్నయ్యను సుఖపెట్టలేనని లెటర్ రాసి వెళ్లిపోయింది కదా. దానికి బదులుగా ఈరోజు నుంచి నువ్వు నా బెడ్ రూమ్ లో నన్ను సుఖపెట్టాలి!" అంటూ ఆమె నడుము పట్టుకుని ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు.
ఇద్దరి శరీరాలు గట్టిగా అతుక్కున్నాయి. పల్లవికి ఊపిరి ఆడటం లేదు. "వదిలేయండి... దయచేసి నన్ను వదిలేయండి బావా..." అని పల్లవి ఏడుస్తూ అతన్ని నెట్టడానికి ప్రయత్నించింది.
Comments