Episode 01

2 words · 1 min read

విశాలమైన హాల్. భయంకరమైన నిశ్శబ్దం. మధ్యలో ఉన్న కుర్చీలో గంభీరంగా కూర్చున్నాడు ఒక వ్యక్తి. అతని ముఖం చాలా ప్రశాంతంగా, కోల్డ్ గా ఉంది... కానీ కళ్ళలో మాత్రం నిప్పులు రగులుతున్నాయి.

"దొరికారా...?"

ఆ ఒక్క మాట. అక్కడ ఉన్న బాడీగార్డ్స్ అందరూ భయంతో తలలు వంచేశారు. ఒక బాడీగార్డ్ వణుకుతూ ముందుకు వచ్చాడు.

"సార్... ఇంకా లేదు."

అతని గొంతులో ఎలాంటి మార్పు లేదు. అదే కోల్డ్ వాయిస్.

"నగరం మొత్తం జల్లెడ పట్టారా?"

"వెతుకుతున్నాం సార్..." నెమ్మదిగా చెప్పాడు ఆ బాడీగార్డ్.

అతను తన చేతిలో ఉన్న గ్లాస్ ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. ఆ చిన్న శబ్దానికే బాడీగార్డ్స్ గుండెల్లో భయం పరిగెత్తింది.

"ఈ నగరంలో... నా అనుమతి లేకుండా... నా కళ్ళ ముందే..."

అతను ఆగాడు. ఎదురుగా ఉన్న వాళ్లకి ఊపిరి ఆడటం లేదు.

"నా ప్రాణంగా చూసుకునే అమ్మాయిని... ఎవరో ముక్కు మొఖం తెలియని వాళ్ళు బలవంతంగా..."

ముందు నిలబడ్డ బాడీగార్డ్ భయంతో వణికిపోతూ గొంతు సవరించుకున్నాడు.

"సార్... మేము మేడమ్ కి ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాం సార్... కానీ అది అనుకోకుండా జరిగిపోయింది..."

ఆ మాట వినగానే అతని కళ్ళలో కోపం మరింత పెరిగింది.

"అంటే... నా కావాల్సిన అమ్మాయిని పట్టుకునే ధైర్యం... ఈ నగరంలో ఇంకా ఉందన్నమాట."

"సారీ సార్... మేము వెతుకుతున్నాం. నేను ఎలాగైనా వాళ్ళని పట్టుకుంటాను."

అతను కుర్చీలోంచి నెమ్మదిగా లేచాడు.

"వాళ్లు ఎక్కడ ఉన్నారో మీకు ఆల్రెడీ చెప్పాను... వెంటనే ఎందుకు రాలేదు?"

ఆ కోల్డ్ వాయిస్ కి బాడీగార్డ్స్ కి చెమటలు పడుతున్నాయి. ప్రాణం పోయేంత భయం వేస్తోంది.

"సార్... మేము ఒక గంటలో పట్టేసుకుంటాం సార్..."

ఆ మాట పూర్తికాకముందే అతను గట్టిగా అరిచాడు.

"నాకు ఎక్స్‌క్యూజెస్ వద్దు... రిజల్ట్ కావాలి!"

గది మొత్తం ఒక్కసారిగా అదిరింది.

"ఒక గంట సేపా...? కుదరదు. ఒక గంటలో ఏమైనా జరగొచ్చు. ఒక మనిషి చచ్చిపోవచ్చు... ఒక అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోవచ్చు."

అందరూ సైలెంట్ అయిపోయారు.

"జస్ట్ హాఫ్ ఆన్ అవర్. అంతే. హాఫ్ ఆన్ అవర్ లో వాళ్లు నా ముందు ఉండాలి. నా అండర్ గ్రౌండ్ సెల్లార్ లో... వాళ్ళు నాకు కనపడాలి."

"యెస్ సార్...!" అందరూ ఒకేసారి అన్నారు.

అతను అక్కడి నుంచి వెళ్ళడానికి అడుగులు వేశాడు. వాళ్ళు ఊపిరి పీల్చుకునే లోపే... అతను మళ్ళీ ఆగాడు. వెనక్కి తిరగకుండానే అన్నాడు.

"ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలి. ఆమె మీద ఒక్క చిన్న గాయం కూడా ఉండకూడదు."

ఆ వాయిస్ లో ఇప్పుడు కోపం కాదు... ఒక వార్నింగ్ ఉంది.

"ఒకవేళ ఆ అమ్మాయి ఒంటి మీద కానీ... ఆమె జీవితంలో కానీ... ఇలాంటి సంఘటన ఇంకోసారి జరిగిందంటే..."

అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.

"అది మీకు చివరి రాత్రి అవుతుంది. నా గురించి మీకు బాగా తెలుసు."

అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని అడుగుల శబ్దం దూరం అవుతున్నా... ఆ బాడీగార్డ్స్ కి భయం మాత్రం అలాగే ఉంది. ఆ అడుగుల శబ్దం గుర్తొస్తేనే వాళ్లకి ఎక్కలేని భయం పుట్టుకొస్తోంది.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు...? ప్రాణంగా చూసుకునే ఆమెకి ఏమైంది...? అసలు ఈ వ్యక్తి ఎవరు...?

విశాలమైన ఆ లగ్జరీ హోటల్ రూమ్ లో ఒకటే నిశ్శబ్దం. మంచం మీద ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో పడుకుని ఉంది.

సడన్ గా... ఆమె పక్కన ఉన్న ఫోన్ రింగ్ అయింది.

ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తల విపరీతంగా బరువుగా ఉంది. కళ్ళు ఇంకా పూర్తిగా తెరవలేకపోతోంది. చేతులు తడుముకుంటూ ఫోన్ ఎక్కడుందో వెతకడం మొదలుపెట్టింది.

"అబ్బా... నా తల పగిలిపోతోంది... ఎక్కడుంది ఫోన్... ఎవరబ్బా ఈ టైమ్ లో..."

మెల్లగా బెడ్ షీట్ మీద చేతులు ఆడిస్తూ ఫోన్ పట్టుకుంది. స్క్రీన్ వైపు చూసింది. స్క్రీన్ మీద ఒక పేరు ఫ్లాష్ అవుతోంది.

'నాన్న'

ఆ పేరు చూడగానే... ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. మత్తు మొత్తం ఎగిరిపోయింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆ కంగారులో చేతిలో నుంచి ఫోన్ కింద పడిపోయింది.

"నాన్న...? ఈ టైమ్ లో ఎందుకు ఫోన్ చేస్తున్నారు...? అసలు టైమ్ ఎంతైంది...?"

కంగారుగా కిందకి వంగి ఫోన్ తీసుకుందామని ప్రయత్నించింది. కానీ... ఒక్కసారిగా ఆమె ముఖం నొప్పితో కందిపోయింది. ఆమె వల్ల కాలేదు.

శరీరం కింద భాగంలో భరించలేని నొప్పి. ఎవరో కత్తులతో కోస్తున్నంత ప్రాణం పోయేంత బాధ.

"ఆహ్... ఏంటిది... నాకెందుకు ఇంత నొప్పిగా ఉంది...? నా ఒళ్ళు ఎందుకు ఇలా కాలిపోతోంది...?"

నొప్పిని పంటి కింద బిగబట్టి... తన శరీరం వైపు చూసుకుంది.

అంతే... ఆమె గుండె ఆగిపోయింది. ఆమె ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేదు.

"దేవుడా... ఏంటిది... నేనెక్కడున్నాను...? ఇదంతా ఏంటి...?"

కంగారుగా, భయంతో చుట్టూ చూసింది. అదొక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ రూమ్. రూమ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కింద ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడిపోయి ఉన్నాయి.

పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది. అక్కడ ఒక ఎర్రటి గులాబీ పువ్వు... దాని పక్కనే సగం తాగేసి వదిలేసిన ఒక వైన్ గ్లాస్.

ఆమెకి నిన్న రాత్రి ఏం జరిగిందో నెమ్మదిగా అర్థమవుతోంది. ఆ నిజం తలచుకోగానే ఆమె శరీరంలో వణుకు మొదలైంది.

"లేదు... లేదు... ఇలా జరిగి ఉండకూడదు... దేవుడా దయచేసి ఇదొక కల అని చెప్పు... నేను... నేను ఒక రాత్రంతా... ఎవరితోనో...?"

ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. గుండె బద్దలవుతోంది. భయంతో పక్కనే ఉన్న దుప్పటిని గట్టిగా తన మీదకు లాక్కుంది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టింది.

"ఎవరు అతను...? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను...? అసలు నిన్న రాత్రి ఆ పార్టీలో ఏం జరిగింది...? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు...?"

తనని తాను ప్రశ్నించుకుంటూ బెడ్ మీద నుంచి కిందకి దిగడానికి ప్రయత్నించింది. అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. నెమ్మదిగా తన బట్టలు ఎక్కడున్నాయా అని వెతికింది.

కింద పడి ఉన్న బట్టలు చూసి ఆమెకి మరింత ఏడుపొచ్చింది. అవన్నీ పూర్తిగా చినిగిపోయి ఉన్నాయి. ఎంత దారుణంగా లాగేస్తే ఆ బట్టలు అలా చినిగిపోతాయో ఆమెకి అర్థమవుతోంది.

"నా బట్టలు... ఇలా చింపేశారు ఏంటి... ఎంత మృగంలా ప్రవర్తించాడు అతను... నన్ను ఒక బొమ్మలా వాడేసుకున్నాడా...?"

పక్కనే సోఫా మీద ఒక వైట్ కలర్ జెంట్స్ షర్ట్ కనిపించింది. వేరే దారి లేక... ఏడుస్తూనే ఆ షర్ట్ ని తీసుకుని ఒంటికి వేసుకుంది. అది ఆమెకి మోకాళ్ళ వరకు వచ్చింది. అలాగే గోడ పట్టుకుని నడుచుకుంటూ నెమ్మదిగా వాష్ రూమ్ లోకి వెళ్ళింది.

అద్దంలో తనని తాను చూసుకుంది.

చెదిరిపోయిన జుట్టు... కళ్ళ నిండా నీళ్లు... ముఖం మీద అలసట. తన మెడ మీద... భుజాల మీద... పంటి గాయాలు. అవి చూసి ఆమెకి తన మీద తనకే అసహ్యం వేసింది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

"ఛీ... నా జీవితం మొత్తం నాశనమైపోయింది... ఇక నా బతుకు ఇంతే..."

ఆమె వణుకుతున్న చేతులతో తన మెడ మీద ఉన్న గాయాలను తాకుకుంది.

"ఒకవేళ నాన్నకి ఈ విషయం తెలిస్తే... ఆయన నన్ను బ్రతకనివ్వరు. ఆయనకు నా మీద ఉన్నది ప్రేమ కాదు, అనుమానం. ఇప్పటికే నేను చేయని తప్పుకు... నన్ను నడిరోడ్డు మీద నిలబెట్టి నరకం చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే... నన్ను ప్రాణాలతో ఉంచరు. కచ్చితంగా నా ప్రాణాలు తీసేస్తారు..."

కన్నీళ్లు కళ్ళలోంచి ఆగకుండా కారుతున్నాయి.

వణుకుతున్న చేతులతో సింక్ ఆన్ చేసి రెండు చేతుల్లో నీళ్లు తీసుకుని ముఖం మీద కొట్టుకుంది. ఆ నీటి చల్లదనానికి ఆమెకి స్పృహ వస్తున్నట్టుంది.

వెంటనే వాష్ రూమ్ బయటికి వచ్చి, కింద పడి ఉన్న తన బ్యాగ్ లో ఉన్న మేకప్ కిట్ బయటికి తీసింది. మళ్లీ అద్దం ముందు నిలబడి, అందులోంచి ఫౌండేషన్ తీసుకుంది.

ఎక్కడెక్కడైతే ఆ గాయాలు ఉన్నాయో... వాటి మీద దట్టంగా పూయడం మొదలుపెట్టింది. ప్రతి గాయం చూస్తున్నప్పుడు ఆమెకి నిన్న రాత్రి జరిగిన దారుణం గుర్తుకు వస్తోంది.

"ఎవరికీ తెలియకూడదు... ఈ విషయం నాన్నకి కూడా తెలియకూడదు... అసలు ఎవరికీ అనుమానం రాకూడదు..."

తనలో తాను గొణుక్కుంటూ... ఆ గాయాలను పూర్తిగా మేకప్ తో కవర్ చేసింది. ముఖాన్ని మళ్లీ నీట్ గా తుడుచుకుని, జుట్టుని కొద్దిగా సర్దుకుంది.

ఇప్పుడు ఆమె చూడటానికి బాగానే ఉంది. ఆ గాయాలు కనిపించడం లేదు. కానీ... మనసులో మాత్రం ఒక అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఒక ఆడపిల్లకి జరగకూడని అతి పెద్ద నష్టం జరిగిపోయింది.

"నన్ను ఇంత దారుణంగా అనుభవించాడు... సరే... కనీసం నేను లేచే వరకు కూడా ఆగకుండా... నన్ను ఒక అనాథలా, ఒక వేశ్యలా ఈ రూమ్ లో వదిలేసి వెళ్ళిపోయాడా...?"

ఆమె మనసులో కోపం... బాధ... అవమానం అన్నీ కలిసిపోతున్నాయి. వాష్ రూమ్ లోంచి బయటికి వచ్చింది.

ఇలా జెంట్స్ షర్ట్ వేసుకుని బయటికి వెళితే అందరూ అనుమానంగా చూస్తారు. హోటల్ స్టాఫ్ ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటి?

చుట్టూ వెతికింది. కప్ బోర్డ్ తీసి చూస్తే అందులో ఒక పొడవాటి జెంట్స్ లాంగ్ కోట్ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని ఆ షర్ట్ మీద వేసుకుంది. ఇప్పుడు ఆమె వేసుకున్న బట్టలు ఎవరికీ పెద్దగా అనుమానం వచ్చేలా లేవు.

తన బ్యాగ్ తీసుకుని... నెమ్మదిగా డోర్ హ్యాండిల్ పట్టుకుంది. ఒకసారి వెనక్కి తిరిగి ఆ రూమ్ వైపు చూసింది. ఆ బెడ్... ఆ వైన్ గ్లాస్... అన్నీ ఆమెని హేళన చేస్తున్నట్టు ఉన్నాయి. గుండె రాయి చేసుకుని ఆ రూమ్ తలుపు తీసింది.

బయట కారిడార్ మొత్తం సైలెంట్ గా ఉంది. ఎవరూ లేరు.

నెమ్మదిగా అడుగులు వేస్తూ... ఎవరి కంటా పడకుండా ఆ హోటల్ లోంచి బయటికి వచ్చింది. బయట చల్లని గాలి తగులుతోంది. ఆ గాలికి ఆమె శరీరం వణికింది.

రోడ్డు మీద ఒక క్యాబ్ వస్తూ కనిపించింది. వెంటనే చెయ్యి ఊపి ఆ క్యాబ్ ని ఆపింది. క్యాబ్ ఆగగానే... వేగంగా వెళ్లి వెనక సీట్లో కూర్చుంది.

"ఎక్కడికి వెళ్ళాలి మేడమ్...?" అడిగాడు డ్రైవర్ అద్దంలోంచి చూస్తూ.

ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ గొంతు సవరించుకుంది. తను ఏడుస్తున్నట్లు అతనికి తెలియకూడదు.

"జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు."

"సరే మేడమ్."

క్యాబ్ స్టార్ట్ అయింది. ఆమె విండోలోంచి బయటికి చూస్తోంది. ఒక పక్క నరకం లాంటి నొప్పి... ఇంకో పక్క అవమానం. ఆమె మెదడులో వందల ప్రశ్నలు.

"ఎవరు అతను...? నేను ఆ హోటల్ కి ఎలా వెళ్ళాను...? నన్ను ఎందుకు టార్గెట్ చేశాడు...? అతనికి నా మీద అంత కోపం ఎందుకు...?"

క్యాబ్ వేగంగా వెళ్తోంది. సగం దూరం వెళ్ళాక... సడన్ గా ఆమె ఫోన్ కి ఒక మెసేజ్ టోన్ వినిపించింది.

ఆమె ఉలిక్కిపడి తన బ్యాగ్ లోంచి ఫోన్ తీసింది. స్క్రీన్ ఆన్ చేసి చూసింది. తన ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది.

"ఎక్కడున్నావే...? రాత్రి నుంచి కనిపించడం లేదు...?"

ఆ మెసేజ్ చదివింది. కానీ ఆమె ముఖంలో ఎలాంటి భావమూ లేదు. కనీసం రిప్లై ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే ఓపిక, పరిస్థితి ఆమెకు లేవు.

ఏమీ పట్టనట్టుగా ఆ ఫోన్ ని పక్కన సీట్లో పడేసింది. మళ్ళీ సైలెంట్ గా విండోలోంచి శూన్యంలోకి చూడటం మొదలుపెట్టింది.

క్యాబ్ అలా ముందుకు వెళ్తూనే ఉంది.

అసలు నిన్న రాత్రి ఆ పార్టీలో ఏం జరిగింది...? తనని ఆ స్థితిలో వదిలేసిన ఆ మనిషి ఎవరు...?

క్యాబ్ వేగంగా ముందుకు వెళ్తోంది. విండోలోంచి వస్తున్న చల్లని గాలి అంజలి ముఖాన్ని తాకుతోంది.

ఆమె పేరు అంజలి. హైదరాబాద్‌లోని ఒక టాప్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. వందల మంది టీమ్ ని తన కనుసన్నల్లో నడిపించే ఒక స్ట్రాంగ్ అమ్మాయి. తన పనులన్నీ పక్కా ప్లానింగ్ తో చేసుకునే ఒక ప్రొఫెషనల్. కానీ ఇప్పుడు?

ఒక క్యాబ్ లో... ఒకరిదో తెలియని ఒక పెద్ద కోట్ వేసుకుని, తన గాయాలను దాచుకుంటూ... తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వణుకుతూ కూర్చుంది. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. తన కార్ ఏమైంది? అసలు నిన్న రాత్రి ఏం జరిగింది?

ఆమె నెమ్మదిగా రెండు చేతులతో తన తలని గట్టిగా పట్టుకుంది. ఆ హోటల్ రూమ్... సగం తాగిన ఆ వైన్ గ్లాస్... తన శరీరం మీద ఉన్న గాయాలు... ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ఆమె గుండె పగిలిపోతోంది. కళ్ళు మూసుకుని నిన్న రాత్రి జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.

Comments

Scroll to Top