తన బిడ్డ కోసం శరీరం అమ్ముకున్న అమ్మాయి… 💔 One Night Stand to a Mafia Boss
శరీరం అమ్ముకున్న అమ్మాయి... తన బిడ్డ కోసం శరీరం అమ్ముకున్న అమ్మాయి... గదిలో ఇప్పుడు సిద్ధార్థ్, మానస మాత్రమే ఉన్నారు. సిద్ధార్థ్ నెమ్మదిగా సోఫాలోంచి లేచి ఆమె వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. అతని ప్రతి అడుగు మానస గుండెల్లో సుత్తితో కొట్టినట్టుగా ఉంది. "డెబ్బై ఐదు లక్షలు... ఒక రాత్రికి," అని గంభీరమైన గొంతుతో అంటూ ఆమెకు అతి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతని ఊపిరి ఆమె మెడను తాకుతోంది. "అంత డిమాండ్ చేసేంత కసి నీలో ఉందా?" అని గుసగుసగా అన్నాడు. మానస భయంతో వెనక్కి అడుగు వేయబోయింది, కానీ సిద్ధార్థ్ ఒక ఉదుటున ఆమె నడుము పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. ఆమె ఊపిరి బిగబట్టింది. అతని బలమైన చేతులు ఆమెను బంధించాయి. "భయపడుతున్నావా?" అని అడిగాడు సిద్ధార్థ్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ. మానస పెదవులు వణుకుతున్నాయి కా నీ మాట రాలేదు. "డబ్బు కోసం వచ్చావు... నీకిష్టమైనా లేకపోయినా ఈ రాత్రి నువ్వు నా దానివి. నా దాహం తీర్చాల్సిన బాధ్యత నీది," అంటూ ఒక్కసారిగా ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. ఆ ముద్దులో ప్రేమ లేదు, ఒక క్రూరమైన ఆధిపత్యం ఉంది. మానస
Chapters RSS