అవతలి వైపు నుంచి డీఎస్పీ సీరియస్ గా, "వాళ్ల అరుపులు పట్టించుకోకు. ఈ కేసులో నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే నీ ఉద్యోగానికి అంత మంచిది. వాళ్లకి కావాలంటే రెండు లాఠీ దెబ్బలు వేసి పంపించు. కానీ ఎంక్వైరీ మాత్రం చేయొద్దు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. అర్థమైందా?" అని ఫోన్ కట్ చేశాడు.
ఈ మొత్తం ఫోన్ కాల్ కన్వర్జేషన్ ని, పోలీస్ స్టేషన్ బయట ఉన్న విక్రమ్ తన మనుషుల ద్వారా ట్యాప్ చేసి విన్నాడు. వెంటనే వెళ్లి రాజ్వీర్ కి ఈ విషయం చెప్పాడు.
రాజ్వీర్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. "ఎస్పీ దాకా వెళ్తారా? వాళ్ల ధైర్యం నాకు నచ్చింది. కానీ వాళ్లు అనవసరంగా నా దారికి అడ్డు వస్తున్నారు విక్రమ్. వెంటనే వాళ్లిద్దరినీ కిడ్నాప్ చేసి, మన గోడౌన్ కి తీసుకురా. నేను వాళ్ల దగ్గర్నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి," అని ఆర్డర్ వేశాడు.
"ఓకే బాస్," అని చెప్పి విక్రమ్ తన మనుషులతో బయలుదేరాడు.
అరుణ తన గదిలో మంచం మీద కుచించుకుపోయి కూర్చుని ఉంది. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు. కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయి ఉన్నాయి.
అప్పుడే తలుపు తెరుచుకుని రాజ్వీర్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో భోజనం ప్లేట్ ఉంది. అతను నేరుగా అరుణ దగ్గరికి వచ్చి, ప్లేట్ ని పక్కన టీపాయ్ మీద పెట్టాడు.
అతన్ని చూడగానే అరుణ వణికిపోయింది. రాజ్వీర్ ఆమె చేతులు పట్టుకుని లాగి, తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు.
"వదులు... నన్ను వదిలేయ్," అంటూ ఆమె గింజుకుంటోంది.
కానీ రాజ్వీర్ తన ఒక బలమైన చేత్తో ఆమె నడుముని గట్టిగా చుట్టి పట్టుకున్నాడు. ఆమె కదలలేకపోయింది. మరో చేత్తో అన్నం ముద్ద కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు.
"నోరు తెరుచు అరుణ... ఉదయం నుంచి ఏమీ తినలేదని తెలుసు. మర్యాదగా తింటావా లేక నా స్టైల్ లో తినిపించమంటావా?" అని చాలా సీరియస్ గా, కోల్డ్ గా అన్నాడు.
అరుణ భయంతో వణుకుతూ నోరు తెరిచింది. అతను ఆమెకు తన చేతులతో భోజనం తినిపిస్తున్నాడు. ఆ సీన్ చూస్తుంటే అందులో ఒక రకమైన రొమాంటిక్ ఫీల్ ఉంది, కానీ అరుణకి మాత్రం అది నరకంలా అనిపిస్తోంది. అతని ఒడిలో కూర్చోవడం ఆమెకు ఇబ్బందిగా ఉంది, కానీ అతను వదలడం లేదు.
ఆమెకు భోజనం తినిపిస్తుండగానే రాజ్వీర్ ఫోన్ రింగ్ అయింది. విక్రమ్ కాల్.
రాజ్వీర్ ఒక చేత్తో అరుణను పట్టుకుని, మరో చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు. "చెప్పు విక్రమ్."
"బాస్... మీరు చెప్పినట్లే ఆ ఇద్దరినీ లేపేశాం. మన గోడౌన్ లో బంధించి ఉంచాం," అని చెప్పాడు విక్రమ్.
"గుడ్. నేను వస్తున్నాను," అని ఫోన్ కట్ చేశాడు రాజ్వీర్. ఆ ఫోన్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియని అరుణ, భయంగా అతని వైపే చూస్తోంది.
భోజనం తినిపించడం పూర్తయ్యాక, ఆమెను కిందకు దింపి, టిష్యూతో ఆమె నోరు తుడిచాడు రాజ్వీర్.
అరుణ కాస్త ధైర్యం తెచ్చుకుని, "నన్ను ఇలా గదిలో బంధించారు. కనీసం నన్ను కాలేజీకి కూడా పంపరా మీరు? నా చదువు ఏమైపోవాలి?" అని అడిగింది.
రాజ్వీర్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, "కాలేజీకి పంపిస్తాను. దానికింకా టైం ఉంది. ముందు నువ్వు నా ఆధీనంలో బతకడం నేర్చుకో. ఆ తర్వాత బయట ప్రపంచం చూద్దువుగాని," అని చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నగర శివార్లలో ఉన్న ఒక పాడుబడిన గోడౌన్.
అక్కడ రాఘవ, కార్తీక్ లను కుర్చీలకు కట్టేసి ఉంచారు విక్రమ్ మనుషులు. వాళ్లిద్దరికీ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఇంతలో గోడౌన్ షట్టర్ పైకి లేచింది.
రాజ్వీర్ లోపలికి అడుగుపెట్టాడు. అతని నడకలో ఒక రాయల్టీ, కళ్లలో ఒక అహంకారం ఉన్నాయి. అతను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ల ముందు ఆగాడు. ఒక కుర్చీ లాక్కుని వాళ్లకి ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
రాఘవ రాజ్వీర్ ని పైనుంచి కిందకు చూశాడు. "ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు?" అని కోపంగా అడిగాడు.
రాజ్వీర్ ఒక సిగరెట్ వెలిగించుకుని, పొగ గాలిలోకి వదులుతూ, "నా పేరు రాజ్వీర్ గులేరియా. నాకు సూటిగా మాట్లాడటం అలవాటు. మీకు అరుణ ఎక్కడ దొరికింది? మీరు అరుణని ఎలా పెంచారు?" అని అసలు విషయానికి ఏమాత్రం సంబంధం లేనట్లుగా చాలా కోల్డ్ గా అడిగాడు.
ఆ ప్రశ్న వినగానే రాఘవకు మైండ్ బ్లాక్ అయింది. ఒక క్షణం ఆలోచించాడు. 'నా కూతురు గురించి వీడెందుకు అడుగుతున్నాడు? అంటే... నా బిడ్డను కిడ్నాప్ చేసింది వీడేనా!' అన్న నిజం అతనికి అర్థమైపోయింది.
"రేయ్... అసలు నాతో ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసింది నువ్వేనా? బద్మాష్! అందుకే నీ మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? నా బిడ్డ ఎక్కడుందిరా దొంగ వెధవ?" అని గట్టిగా అరిచాడు రాఘవ కోపంతో.
కార్తీక్ కూడా వాళ్ల నాన్నకు సపోర్ట్ గా, "రేయ్, మా చెల్లిని ఏమైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో వదలంరా!" అని అరిచాడు. కానీ ఆ అరుపులో ఒక వణుకు ఉంది.
కార్తీక్ కి 'రాజ్వీర్ గులేరియా' అంటే ఎవరో తెలుసు. నగరంలో అతను ఒక పెద్ద మాఫియా కింగ్ అని, అతని సామ్రాజ్యాన్ని ఎవరూ కదిలించలేరు అని కార్తీక్ కి బాగా తెలుసు. ఆ పేరు వినగానే కార్తీక్ మనసులో ఒక భయం మొదలైంది. 'నా చెల్లి ఒక రాక్షసుడి చేతిలో పడిపోయిందే' అని అతని గుండె పగిలిపోయింది.
వాళ్ళు అరుస్తున్నా రాజ్వీర్ ఏమాత్రం చలించలేదు. "నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. పదేళ్ల క్రితం అరుణ మీకు ఎలా దొరికింది?" అని మళ్ళీ అదే సీరియస్ టోన్ లో అడిగాడు రాజ్వీర్.
"నేను నీకు ఎలాంటి సమాధానం చెప్పనురా! ముందు నా బిడ్డను నాకు అప్పగించు," అని రాఘవ మొండికేశాడు. కార్తీక్ కూడా భయంతోనే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.
రాజ్వీర్ లేచి నిలబడ్డాడు. చేతిలోని సిగరెట్ ని నేల మీద పడేసి బూటు కాలుతో నలిపేశాడు.
"వీళ్లకు మర్యాదగా అడిగితే చెప్పేలా లేరు విక్రమ్," అంటూ విక్రమ్ వైపు చూశాడు. "వీళ్ళను ఇక్కడే ఉంచండి. కానీ తీవ్రంగా టార్చర్ చేయొద్దు. కొట్టొద్దు. కానీ వీళ్ళ మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతినేలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అప్పుడే వీళ్ళ నోరు తెరుచుకుంటుంది," అని చాలా కోల్డ్ గా ఆర్డర్ వేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు రాజ్వీర్.
విక్రమ్ వాళ్ళిద్దరికీ నిద్ర లేకుండా, భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఒక మానసిక చిత్రహింస ప్రారంభించాడు.
రాత్రి పదిన్నర అవుతోంది.
రాజ్వీర్ ఇంటికి చేరుకుని నేరుగా అరుణ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో డిమ్ లైట్ వెలుగుతోంది. అరుణ బెడ్ మీద కూర్చుని తన చేతి వేళ్లతో ఆడుకుంటూ, బిక్కుబిక్కుమంటూ ఉంది.
రాజ్వీర్ తన కోట్ తీసి సోఫాలో విసిరేసి, చేతిలో ఉన్న డిన్నర్ ప్లేట్ ని తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఉదయం లాగే ఆమె పక్కన కూర్చుని, ఏమీ మాట్లాడకుండా తన చేత్తో భోజనం తినిపించడం మొదలుపెట్టాడు. అరుణ భయంతో వణుకుతూనే అతను పెడుతున్న ముద్దలు మింగుతోంది.
భోజనం పూర్తయ్యాక, రాజ్వీర్ ప్లేట్ ని పక్కన పెట్టాడు. నెమ్మదిగా అరుణ వైపు తిరిగి, ఆమె కళ్లలోకి లోతుగా చూశాడు. ఆ చూపుల్లో పగలు ఉన్న కాఠిన్యం లేదు, ఒక మంటలా దహించే మోహం, ఒక ఆధిపత్యపు ప్రేమ కనిపిస్తున్నాయి.
అరుణ భయంతో వెనక్కి జరగబోయింది. కానీ రాజ్వీర్ ఒకే ఉదుటున ఆమె మీదకు వంగి, ఆమె పెదవుల మీద తన పెదవులను బలంగా ఆన్చాడు.
అరుణ ఉలిక్కిపడి, "ఉమ్మ్..." అంటూ అతని ఛాతి మీద చేతులు వేసి గట్టిగా నెట్టడానికి ప్రయత్నించింది. తల పక్కకు తిప్పాలని చూసింది. కానీ రాజ్వీర్ పట్టు విడవలేదు. తన రెండు బలమైన చేతులతో ఆమె రెండు చేతులను పట్టుకుని, తల పైకి తీసుకెళ్లి మంచం మీద గట్టిగా లాక్ చేశాడు.
ఆమె కదలలేకుండా పోయింది. కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. అతను ఆమె పెదవులను వదిలి, నెమ్మదిగా ఆమె బుగ్గల మీద, ఆ తర్వాత ఆమె సున్నితమైన మెడ మీద వేడిగా, గాఢంగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. అతని ఊపిరి ఆమె చర్మాన్ని తాకుతుంటే అరుణకు ఒంట్లో ఒక వింతైన వణుకు పుడుతోంది.
"వదులు... ప్లీజ్ వదిలేయ్," అని ఏడుస్తూ గుసగుసలాడింది అరుణ.
రాజ్వీర్ ఆమె మెడ దగ్గర ఆగి, మత్తుగా ఆమె కళ్లలోకి చూస్తూ, "నువ్వు ఎంత వద్దు అన్నా నాకేం ఫరక్ పడదు అరుణ. నిన్ను నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు," అని గుసగుసలాడాడు.
అలా చెబుతూనే, ఆమె ఎక్కడ ముట్టుకుంటే కరిగిపోతుందో, ఎక్కడ స్పర్శిస్తే ఆమెలోని ఫీలింగ్స్ మేల్కొంటాయో అతనికి తెలిసినట్లుగా, చాలా సున్నితంగా, అదే సమయంలో ఫోర్స్ ఫుల్ గా ఆమెను టచ్ చేయడం మొదలుపెట్టాడు. అతని వేళ్లు ఆమె నడుము వంపులను, భుజాలను స్పృశిస్తుంటే, అరుణకి తెలియకుండానే ఆమె శరీరంలో ఒక అంతుచిక్కని మంట రేగుతోంది. ఆమె మెదడు వద్దు అని చెబుతున్నా, ఆమె శరీరం మాత్రం రాజ్వీర్ స్పర్శకు కరిగిపోతూ రియాక్ట్ అవుతోంది.
ఆమె పెదవుల నుంచి నెమ్మదిగా సన్నటి మూలుగులు రావడం రాజ్వీర్ గమనించాడు. అతని పెదవులపై విజయగర్వంతో కూడిన నవ్వు వెలిసింది. ఆమె ప్రతిఘటన పూర్తిగా ఆగిపోయేలా, ఆమె తన మత్తులో మునిగిపోయేలా చేశాడు. ఆ రాత్రి అరుణ ఇష్టంతో సంబంధం లేకుండా, ఆమె మనసును కూడా తన స్పర్శతో లొంగదీసుకుని, తనకు నచ్చినంత సేపు ఆమెతో ఇంటిమేట్ గా గడిపాడు రాజ్వీర్. ఆ గదిలో కేవలం వారిద్దరి శ్వాసల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి.
మరుసటి రోజు ఉదయం… సూర్యోదయం అయింది.
రాజ్వీర్ తన స్టడీ రూమ్ లోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చేతిలో ఒక పెన్ తీసుకుని టేబుల్ మీద మెల్లగా తడుతున్నాడు. అతని కళ్లలో ఎన్నో ఆలోచనలు. రాత్రి అరుణ తన స్పర్శకు లొంగిపోయిన తీరు ఒక వైపు ఆనందాన్ని ఇస్తుంటే, మరోవైపు గోడౌన్ లో ఉన్న రాఘవ గురించి అతడి బుర్రలో అనేక ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి.
"పదేళ్ల క్రితం ఆ సంఘటన జరిగిన తర్వాత అరుణ అసలు వాళ్లకు ఎలా దొరికింది? నేను ఎంత భయపెట్టినా వాళ్లు ఎందుకు నిజం చెప్పట్లేదు? వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఏదో పెద్ద నిజం దాస్తున్నట్టే ఉన్నారు..." అని మనసులో తీవ్రంగా మథనపడుతున్నాడు.
అదే సమయంలో అతని ఆలోచనలు మరోవైపు మళ్లాయి. "కింద గదిలో ఉన్న ఆవిడైతే ఎలాగో దొరికింది... కానీ మా అమ్మానాన్నలను నేను ఎలా వెతకాలి? వాళ్ల జాడ ఎలా కనుక్కోవాలి? అసలు వాళ్లను ఎక్కడ దాచారు?" అన్న ఒక పెద్ద ఆలోచనలో పడిపోయాడు రాజ్వీర్. అతని కళ్లలో కసి, తన వాళ్లను వెతికి పట్టుకోవాలన్న ఒక భయంకరమైన పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Comments