గదిలో ఏకాంతంగా ఉన్న అరుణకు మళ్లీ గుండె దడ మొదలైంది. రాజ్వీర్ ఎప్పుడు వస్తాడో అన్న భయంతో వణుకుతోంది. పగలు జరిగిన పరిణామాలు, అతను బలవంతంగా తినిపించిన విధానం అన్నీ ఆమె మనసులో తిరుగుతున్నాయి.
హఠాత్తుగా డోర్ తెరుచుకుంది. రాజ్వీర్ లోపలికి అడుగుపెట్టాడు. వైట్ షర్ట్, స్లీవ్స్ పైకి మడిచి ఉన్నాయి. కళ్లలో ఎప్పటిలాగే కోల్డ్ అండ్ డేంజరస్ లుక్.
అతన్ని చూడగానే అరుణ రెండు అడుగులు వెనక్కి వేసింది. ఆమె కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్వీర్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె వైపు వస్తున్నాడు. ఒక సింహం తన వేటను సమీపిస్తున్నట్లుగా ఉంది అతని నడక.
"దూరం... దూరంగా ఉండండి!" వణుకుతున్న గొంతుతో అంది అరుణ.
రాజ్వీర్ పెదవులపై ఒక వంకర నవ్వు వెలిసింది. ఆమె వెనక్కి వెనక్కి వెళ్లి గోడకు ఆనుకునే వరకు నడుస్తూనే ఉన్నాడు. ఆమె గోడకు ఆనుకోగానే, తన రెండు చేతులను ఆమె తలకు ఇరువైపులా గోడ మీద ఆనించి, ఆమెను తన బాడీతో లాక్ చేశాడు. అతని వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది.
"బాగా భోజనం చేసినట్టున్నావు? ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చినట్లుంది కదా?" అన్నాడు ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ. అతని గొంతు కఠినంగా ఉన్నా, అందులో ఏదో తెలియని ఆనందం దాగి ఉంది.
అరుణ తల వంచుకుని ఏడుస్తూనే ఉంది. "ప్లీజ్ నన్ను వదిలేయండి... నాకెందుకింత నరకం చూపిస్తున్నారు?"
రాజ్వీర్ తన కుడి చేతి బొటనవేలితో ఆమె పెదవులను గట్టిగా స్పృశించాడు. "నరకమా? ఇది నరకం కాదు అరుణ. ఇది నా సామ్రాజ్యం. నువ్వు నా సొంతం. ఈ గోడల మధ్య నీ ప్రతి శ్వాస, నీ ప్రతి కదలిక నా ఆధీనంలోనే ఉంటాయి," అంటూ ఆమె మెడ దగ్గరికి వంగాడు.
ఆమె భయంతో కళ్లు మూసుకుంది. "ప్లీజ్... వద్దు," అని గుసగుసలాడింది.
కానీ రాజ్వీర్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. అప్పుడే అతని కళ్ళు ఆమె సున్నితమైన మెడ మీద పడ్డాయి. నిన్న రాత్రి తను చేసిన గాయాలు అక్కడ ఎర్రగా కందిపోయి ఉన్నాయి. వాటిని చూడగానే ఎప్పుడూ కఠినంగా ఉండే అతని కళ్ళలో ఒక క్షణం తెలియని బాధ కనిపించింది. తన వేలితో ఆ గాయాలను చాలా సున్నితంగా స్పృశించాడు. ఆ స్పర్శకు అరుణ ఉలిక్కిపడింది.
రాజ్వీర్ నెమ్మదిగా వంగి, ఆ గాయాల మీద తన పెదవులతో ఎంతో మృదువుగా, ప్రేమగా ముద్దులు పెట్టాడు. నిన్నటి గాయాలకు ఇవాళ తన ముద్దులతోనే మందు రాస్తున్నాడు. ఒక గాజు బొమ్మను తాకుతున్నంత జాగ్రత్తగా ఆమెను టచ్ చేస్తున్నాడు.
అరుణకి ఊపిరి ఆగిపోయినంత పనైంది. నిన్నటి దాకా ఒక మృగంలా ప్రవర్తించిన ఈ వ్యక్తిలో, సడెన్ గా ఇంత సున్నితత్వం ఎక్కడి నుంచి వచ్చింది? తన గాయాల మీద అతను ముద్దులు పెడుతుంటే, ఆమె ఒంట్లో ఒక తెలియని కరెంటు పాకినట్లు అనిపించింది. భయం స్థానంలో ఒక వింతైన అలజడి మొదలైంది. "ఎవరు ఇతను? నాకెందుకు ఇలా చేస్తున్నాడు? ఒక నిమిషం నా ప్రాణాలు తీసే రాక్షసుడిలా ఉంటున్నాడు, ఇంకో నిమిషం నా గాయాలకు ఇలా ముద్దులు పెడుతున్నాడు. ఇదంతా నా భ్రమా? లేక ఇతనిలో రెండు ముఖాలు ఉన్నాయా?" అని ఆమె మెదడు కన్ఫ్యూజ్ అవుతోంది.
ఆమె ఆలోచనల్లో ఉండగానే, అతను ఆమెను నెమ్మదిగా తన ఒడిలోకి లాక్కున్నాడు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని, ఏమాత్రం కనికరం లేకుండా ఆమె పెదవుల మీద బలంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఊపిరి ఆడనివ్వని ఇంటెన్సిటీ ఉంది. అరుణ కళ్లలోంచి నీళ్లు జలజలా రాలుతున్నాయి.
అతని పట్టు విడిపించుకోవడానికి తన చేతులతో అతని ఛాతి మీద కొడుతోంది, గోళ్లతో గీరుతూ నెట్టేయాలని చూస్తోంది. కానీ ఆమె ఎంత తోసేస్తున్నా రాజ్వీర్ ఊరుకోలేదు. ఆమె ప్రతిఘటించే కొద్దీ అతని పట్టు మరింత బిగుసుకుంటోంది. అతని చేతులు ఆమె నడుమును గట్టిగా చుట్టేసి, తన శరీరానికి అదుముకున్నాయి. ఆ ముద్దులో పగ లేదు, కానీ విపరీతమైన ఆధిపత్యం, ఒక రకమైన పిచ్చి ప్రేమ ఉన్నాయి. భయం, బాధ, మరియు అతని మోహపు వలయంలో చిక్కుకుని అరుణ పూర్తిగా నిస్సహాయురాలైపోయింది.
చాలా సేపటి తర్వాత ఆమెకు ఊపిరి ఆడే అవకాశం ఇస్తూ పెదవులు విడిచాడు. అరుణ రొప్పుతూ, కన్నీళ్లతో అతని ఛాతి మీద వాలిపోయింది. ఆ రాత్రి కూడా రాజ్వీర్ ఆమెను తన గుప్పిట్లో బంధించాడు. బయట ప్రపంచానికి కఠినంగా కనిపించే ఆ మృగం, ఆమెను చుంబిస్తున్నప్పుడు మాత్రం ఏదో తెలియని ఆర్తిని చూపిస్తున్నాడు. కానీ అరుణకు మాత్రం అదొక బలవంతపు ప్రేమగానే అనిపిస్తోంది.
ఉదయం లేత సూర్య కిరణాలు ఆ విశాలమైన గదిలోకి ప్రవేశిస్తున్నాయి.
రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంటూ, అలిసిపోయి నిద్రపోయిన అరుణకు నెమ్మదిగా మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూసేసరికి, తన పక్కనే బెడ్ మీద రాజ్వీర్ కూర్చుని ఉన్నాడు. అతను అప్పటికే స్నానం చేసి, వైట్ షర్ట్ వేసుకుని, చేతికి వాచ్ పెట్టుకుంటున్నాడు. అతని కళ్లు మాత్రం అరుణ మీదే ఉన్నాయి. ఆ చూపుల్లో ఎప్పటిలాగే ఒక అంతుచిక్కని కాఠిన్యం, ఒక కోల్డ్ నెస్ ఉన్నాయి.
అతన్ని చూడగానే అరుణకు రాత్రి జరిగిన పరిణామాలు గుర్తొచ్చి గుండె దడదడలాడింది. గబగబా తన మీద ఉన్న దుప్పటిని మెడ వరకు లాక్కుని, భయంతో ముడుచుకుపోయింది.
రాజ్వీర్ ఆమె భయాన్ని చూసి పెదవులపై ఒక చిన్న నవ్వు తెచ్చుకున్నాడు. నెమ్మదిగా ఆమె వైపు వంగి, తన వేలితో ఆమె బుగ్గను తాకుతూ, "భయంగా ఉందా?" అని చాలా కోల్డ్ గా అడిగాడు.
అరుణ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది, కానీ ఆమె వణుకుతున్న పెదవులు ఆమె భయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.
"ఈ భయం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా మాటకు ఎదురు చెప్పాలని కానీ, ఈ గది దాటి వెళ్లాలని కానీ ఆలోచించకు," అని ఆమె ముఖం మీద పడిన జుట్టును వెనక్కి నెట్టి, అక్కడి నుంచి లేచి బయటకి వెళ్లిపోయాడు రాజ్వీర్. అతను వెళ్లగానే అరుణ గుండె మీద చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది.
రాజ్వీర్ ఇంటి కింద అంతస్తులో ఉన్న ఒక గది. ఆ గదిలో నిన్న విక్రమ్ తీసుకువచ్చిన ఆ నలభై ఏళ్ల మహిళ అపస్మారక స్థితిలో పడుకుని ఉంది. ఆవిడకి ఇద్దరు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. విక్రమ్ అక్కడే నిలబడి అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక డాక్టర్ బయటకు వచ్చాడు.
"ఎలా ఉంది డాక్టర్?" అని అడిగాడు విక్రమ్.
డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి, "బాడీ మీద చాలా దారుణమైన గాయాలు ఉన్నాయి విక్రమ్. దానికి మించి మెంటల్ గా చాలా పెద్ద షాక్ లో ఉన్నారు. ఇన్నేళ్ల పాటు ఒకే చీకటి గదిలో బంధీగా ఉండటం వల్ల ఆవిడ నరాలు చాలా వీక్ అయిపోయాయి. నేను కొన్ని మందులు రాసిచ్చాను. ఆవిడ త్వరగా కోలుకోవాలంటే మంచి వాతావరణం, ప్రశాంతత కావాలి," అని చెప్పాడు.
"సరే డాక్టర్," అని చెప్పి, విక్రమ్ నేరుగా రాజ్వీర్ స్టడీ రూమ్ కి వెళ్లాడు.
రాజ్వీర్ చేతిలో ఒక కాఫీ మగ్ పట్టుకుని, విండోలోంచి బయటకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
"బాస్... డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆవిడ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పారు," అని వినయంగా చెప్పాడు విక్రమ్.
రాజ్వీర్ కాఫీ మగ్ ని టేబుల్ మీద పెట్టి, "జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడకి ఏ లోటూ రాకూడదు," అని తన కోల్డ్ వాయిస్ లో చెప్పాడు. అతని మాటల్లో కాఠిన్యం ఉన్నా, ఆవిడ పట్ల ఏదో తెలియని ఒక బాధ్యత కనిపిస్తోంది. ఇంతకీ ఆవిడ ఎవరు? రాజ్వీర్ కి ఆవిడకి ఉన్న సంబంధం ఏంటి? అన్నది ప్రస్తుతానికి ఒక మిస్టరీ.
ఆ విశాలమైన జమీందార్ బంగ్లాలో, ఎవరికీ అంత త్వరగా కనపడని ఒక పాడుబడిన చీకటి గది. ఆ గదిలో దుమ్ము, ధూళి నిండిపోయి ఉన్నాయి. సరిగ్గా వెలుతురు కూడా రావడం లేదు. ఒక మూల నేల మీద ఇద్దరు వృద్ధ దంపతులు దీనంగా కూర్చుని ఉన్నారు. వాళ్ల బట్టలు చిరిగిపోయి, శరీరాలు ఎముకల గూడులా మారిపోయి ఉన్నాయి. వాళ్ల ముఖాల్లో ఏదో చెప్పలేని వేదన.
అప్పుడే ఆ గది తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. ఒక పనివాడు చేతిలో ఒక పాత సిల్వర్ ప్లేట్ తో లోపలికి వచ్చాడు. అందులో చల్లారిపోయిన అన్నం, ఏదో నీళ్ల కూర ఉన్నాయి. ఆ ప్లేట్ ని వాళ్ల ముందు నేల మీదకి విసిరేస్తూ కొట్టాడు. అన్నం కాస్త కింద పడిపోయింది. ఆ వృద్ధులిద్దరూ ఉలిక్కిపడ్డారు.
"తినండి! అసలు ఎన్ని సంవత్సరాలు బతికి ఉంటార్రా మీరు? మీ వల్ల మాకు ఈ చాకిరీ ఏంటి, ఈ కర్మ ఏంటి? రోజుకొచ్చి మీకు ఈ ఫుడ్ విసిరేసి పోవాలంటే నాకు చిరాకు దొబ్బుతోంది. త్వరగా చావొచ్చు కదా," అని కసిగా తిట్టాడు ఆ పనివాడు.
ఆ మాటలకు ఆ వృద్ధురాలు భయంతో వణికిపోయింది. కానీ ఆ వృద్ధుడు మాత్రం కోపంగా తలెత్తి ఆ పనివాడి వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో ఒకప్పటి అధికారం, ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత కలగలిపి ఉన్నాయి. ఆ చూపులకి ఒక క్షణం పనివాడు వెనక్కి తగ్గాడు.
కానీ వెంటనే తేరుకుని నవ్వుతూ, "ఏంట్రా ఆ చూపులు? ఈ చూపులకు ఏమి తక్కువ లేదు ఈ ముసలోడికి! ఒంట్లో సత్తువ లేదు కానీ పొగరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మీ బతుకులు ఇక్కడే ఈ చీకటి గదిలో కుళ్లి చావాల్సిందే," అని దెప్పిపొడిచి, తలుపులు దభేల్ మని వేసుకుని వెళ్లిపోయాడు.
తలుపు వేయగానే ఆ వృద్ధుడు తన పక్కనే ఉన్న భార్య వైపు చాలా సీరియస్ గా, కోపంగా చూశాడు. ఆ చూపులకి అర్థం... 'నాడు నువ్వు చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కదా, ఈ రోజు మనకి ఈ గతి పట్టింది' అన్న ఒక నింద అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన భర్త చూపుల్లో ఉన్న నిందను భరించలేక, తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదన్నట్లుగా, కన్నీళ్లు కారుస్తూ తలదించుకుని ఉండిపోయింది. ఇంతకీ వాళ్లెవరు? ఆవిడ చేసిన ఆ తప్పు ఏంటి?
అరుణ కనపడకుండా పోయి రోజులు గడుస్తుండటంతో రాఘవ, కార్తీక్ లకు పిచ్చెక్కిపోతోంది. ఎస్సై కేసుని పట్టించుకోకపోవడంతో వాళ్లు మళ్లీ పోలీస్ స్టేషన్ కి వచ్చారు.
రాఘవ కోపంతో ఎస్సై టేబుల్ మీద చెయ్యి కొట్టి, "ఏం చేస్తున్నారు సార్ మీరు? నా కూతురు కనపడకుండా పోయి ఇన్ని రోజులవుతోంది, కనీసం ఒక్క క్లూ కూడా పట్టుకోలేరా? అసలు ఆ రోజు గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? మీరు పబ్లిక్ సర్వెంట్స్... ప్రజల కోసం పని చేయాల్సిన మీరు, మాకు ఏ హెల్ప్ చేయట్లేదు. మేమేమైనా టాక్స్ లు కట్టట్లేదా?" అని గట్టిగా అరిచాడు.
ఎస్సైకి చిర్రెత్తుకొచ్చింది. "ఏయ్! మర్యాదగా మాట్లాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చి నా టేబుల్ మీదే చెయ్యి కొడతావా? నీ కూతురు ఎవడితోనైనా లేచిపోయిందేమో, వెళ్లి వెతుక్కోండి. నా ప్రాణం తీయకండి," అని కసిరాడు.
కార్తీక్ కి కోపం నషాలానికి అంటింది. "మాట్లాడితే నా చెల్లి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావ్ ఏంటి సార్? మీరెంత కరప్ట్ ఆఫీసరో మాకు అర్థమవుతోంది. మీరు ఈ కేసు సాల్వ్ చేయకపోతే మేము ఊరుకోము, ఎస్పీ దాకా వెళ్తాము," అంటూ గొడవకు దిగాడు.
ఆ గొడవ పెద్దది అవుతుండటంతో ఎస్సైకి ఏం చేయాలో అర్థం కాలేదు. "మీరు ఇక్కడే ఉండండిరా, మీ సంగతి చెప్తాను," అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి డీఎస్పీకి ఫోన్ కలిపాడు.
"సార్... ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి తండ్రి, అన్నయ్య స్టేషన్ కి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు. ఎస్పీ దాకా వెళ్తాము అని బెదిరిస్తున్నారు. ఏమైనా చిన్న క్లూ దొరికినా వదిలించుకుందాం అనుకుంటే, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది. అసలు ఏంటి సార్ ఈ కేసు వ్యవహారం?" అని అడిగాడు ఎస్సై.
Comments