Romance
Ongoing
రాక్షసుడైన బావతో ఇష్టం లేని పెళ్లి
2 chapters
·
2 min total read
విక్రమ్, నిత్య బావామరదళ్లు. గతంలో నిత్య తండ్రి రామ్మూర్తి డబ్బు గర్వంతో విక్రమ్ ని, అతని తల్లిని అవమానించి గెంటేస్తాడు. కొన్నేళ్ల తర్వాత రామ్మూర్తి అప్పుల పాలవడం వల్ల నిత్య పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. అప్పుడు విక్రమ్ తల్లి భవాని కోరిక మేరకు విక్రమ్ నిత్యను పెళ్లి చేసుకుంటాడు. కానీ నిత్య తన డబ్బు చూసే తనని పెళ్లి చేసుకుందని విక్రమ్ అపార్థం చేసుకుంటాడు. పెళ్లయిన మొదటి రోజు నుంచే విక్రమ్ పగ తీర్చుకోవడం మొదలుపెడతాడు. కుటుంబ సభ్యుల ముందు నిత్యను మహారాణిలా చూసుకుంటున్నట్లు నటిస్తూనే, గదిలో నాలుగ్గోడల మధ్య ఆమెకు నరకం చూపిస్తాడు. నేల మీద చలిలో పడుకోబెట్టడం, బాల్కనీలో నిలబెట్టడం, ప్రతి చిన్నదానికీ దారుణంగా కొట్టడం, ఆమె క్యారెక్టర్ ను అనుమానించడం చేస్తాడు. మరోవైపు నిత్య తండ్రి రామ్మూర్తికి ఆర్థికంగా సాయం చేసి అతని దృష్టిలో విక్రమ్ దేవుడిలా మారిపోతాడు. తన కష్టం ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా ఎవరూ నమ్మరని నిత్య ఒంటరిగా కుమిలిపోతుంది. విక్రమ్ పెట్టే మానసిక, శారీరక హింసను భరించలేక ఒకరోజు నిత్య ఎవరికీ చెప్పకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
Chapters RSS