"పేరు అరుణ... వయసు ఇరవై రెండు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తాడు. ఒక అన్నయ్య ఉన్నాడు. అరుణ చాలా సైలెంట్ గా ఉంటుంది, పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు బాస్," అని గడగడా చెప్పేశాడు విక్రమ్.
రాజ్వీర్ కళ్లు ఆ ఫోటో మీదే ఉన్నాయి. "ఈ రోజు సాయంత్రం లోపు... ఈ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. సైలెంట్ గా పని జరిగిపోవాలి," అని చాలా కోల్డ్ గా ఆర్డర్ వేశాడు.
"కానీ బాస్... కిడ్నాప్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, మన దాకా వస్తే..." అని విక్రమ్ సందేహం వ్యక్తం చేశాడు.
రాజ్వీర్ తలెత్తి విక్రమ్ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులోని క్రూరత్వానికి విక్రమ్ వెన్నులో వణుకు పుట్టింది. "నేను చెప్పింది చేయ్. పోలీసులైనా, ఇంకెవరైనా నా ఇష్టం లేకుండా నా ఇంటి గడప తొక్కలేరని నీకు తెలుసు. సాయంత్రానికి ఆమె నా బెడ్ రూమ్ లో ఉండాలి. వెళ్ళు!" అని గర్జించాడు. విక్రమ్ వణుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సాయంత్రం నాలుగు గంటలు. సూర్యుడు నెమ్మదిగా పడమటి వైపు వాలుతున్నాడు.
అరుణ తన మనసుకి కొద్దిగా ప్రశాంతత దొరుకుతుందేమో అని ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లింది. దేవుడి ముందు నిలబడి కళ్లు మూసుకుని, "నా మనసులోని ఈ భయాన్ని దూరం చేయి స్వామీ... మళ్లీ నా పాత జీవితాన్ని నాకు ఇవ్వు," అని వేడుకుంది. గుడిలోంచి బయటకు వచ్చి, ఒంటరిగా నడుచుకుంటూ ఇంటి వైపు అడుగులు వేస్తోంది. ఆ దారి కొంచెం నిర్మానుష్యంగా ఉంది.
సడెన్ గా ఒక నల్లటి పెద్ద ఎస్.యూ.వి కార్ వేగంగా వచ్చి ఆమె పక్కన ఆగింది. కార్ టైర్లు రోడ్డు మీద రాసుకుంటూ పెద్ద శబ్దం చేశాయి. అరుణ కంగారుగా పక్కకు తప్పుకోబోయే లోపే, కార్ డోర్స్ తెరుచుకున్నాయి. లోపలి నుంచి ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు బయటకు దూకారు. అరుణ ఏదో ప్రమాదం జరగబోతోందని పసిగట్టి వెనక్కి పరిగెత్తబోయింది. కానీ ఒక వ్యక్తి ఆమె చేతులను వెనక్కి విరిచి పట్టుకోగా, మరొక వ్యక్తి ఆమె నోటికి ఒక క్లోరోఫామ్ కలిపిన రుమాలును గట్టిగా అదరిమిపట్టాడు.
"వద... వదలండి..." అని ఆమె గింజుకుంది. కళ్లు పెద్దవి చేసి ప్రాణభయంతో తన్నుకుంది. కానీ ఆ ఇద్దరు మృగాల ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోలేదు. పది సెకన్లలోనే మందు ప్రభావం ఆమె నరాలకు ఎక్కింది. ఆమె కళ్లు నెమ్మదిగా మూసుకుపోయాయి. శరీరం బలాన్ని కోల్పోయి కుప్పకూలిపోయింది. వాళ్ళు చాలా సునాయాసంగా ఆమెను కార్ లోకి విసిరేసి, డోర్ వేసుకుని అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలో మాయమైపోయారు.
చీకటి పడింది.
అరుణకు నెమ్మదిగా స్పృహ వస్తోంది. కళ్లు తెరవడానికి ప్రయత్నిస్తోంది కానీ తల విపరీతంగా బరువుగా ఉంది. మెల్లగా కళ్లు తెరిచి చూసేసరికి తను ఒక అత్యంత విశాలమైన, ఖరీదైన గదిలో ఉంది. ఆ గదిలో లైటింగ్ చాలా డిమ్ గా ఉంది. గోడలన్నీ డార్క్ గ్రే కలర్ లో ఉన్నాయి. గది మధ్యలో ఉన్న పెద్ద కింగ్ సైజ్ బెడ్ మీద తను పడుకుని ఉంది. ఒక్కసారిగా ఆమెకు గుడి దగ్గర జరిగిన కిడ్నాప్ గుర్తొచ్చింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెమటలు పడుతున్నాయి.
వెంటనే మంచం దిగి గది తలుపు వైపు పరుగులు తీసింది. తలుపు హ్యాండిల్ పట్టుకుని లాగింది, కానీ అది బయట నుంచి లాక్ చేయబడి ఉంది. "ఎవరైనా ఉన్నారా... తలుపు తీయండి! నన్ను ఎందుకు ఇక్కడ బంధించారు? తలుపు తీయండి!" అని గట్టిగా అరుస్తూ తలుపును బాదింది. ఎవరి దగ్గర నుంచీ ఎలాంటి సమాధానం లేదు. కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. అది చాలా ఎత్తైన ప్రదేశం. కింద అంతా చీకటిగా ఉంది, చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. అది చూసి ఆమెకు ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. తను ఒక భయంకరమైన మాఫియా స్థావరంలో ఇరుక్కుపోయిందని అర్థమైంది.
అప్పుడే గది తలుపు అన్ లాక్ అయిన శబ్దం వినిపించింది.
అరుణ భయంతో వెనక్కి తగ్గింది. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టాడు రాజ్వీర్. ఆరడుగుల ఎత్తు, బ్లాక్ సూట్ లో ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి జాలి లేదు, కళ్లలో ఒక రకమైన మృగత్వం, చల్లదనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తున్నాడు.
అతన్ని చూడగానే అరుణకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. "ను... నువ్వా?" అంటూ వణుకుతున్న గొంతుతో అంది. ఆ హోటల్ గదిలో తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు మళ్లీ తన కళ్ల ముందు ఉండటం చూసి ఆమెకు కాళ్లు చేతులు ఆడలేదు. గోడకు ఆనుకుని భయంతో కుంచించుకుపోయింది.
రాజ్వీర్ పెదవులపై ఒక వంకర నవ్వు వెలిసింది. జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా ఆమె వైపు నడుస్తూ వచ్చాడు. "అవును... నువ్వు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? నన్ను మర్చిపోయావా ఏంటి?" అని చాలా కోల్డ్ గా అన్నాడు.
"న... నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకు దండం పెడతాను... నన్ను వదిలేయండి. మీరేం చేసినా నేను ఎవరికీ చెప్పను. ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపించేయండి," అని రెండు చేతులు జోడించి కన్నీళ్లతో ప్రాధేయపడింది అరుణ.
రాజ్వీర్ ఆమెకు బాగా దగ్గరగా వచ్చి ఆగాడు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆమెకు తగిలేంత దగ్గరగా. తన బలమైన చేత్తో ఆమె దవడను గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకి అరుణకు నొప్పి పుట్టి కళ్లు మూసుకుంది.
"వదిలేయడానికా నిన్ను వెతికి పట్టుకొచ్చింది? ఆ రాత్రి నువ్వు నా దానివి అయ్యావు. ఇక జీవితాంతం నువ్వు నా దానివే. ఈ రాజ్వీర్ గులేరియా అడుగుపెట్టిన తర్వాత వెనక్కి తిరగడం ఉండదు. నువ్వు ఇక్కడే ఉంటావు... నాతోనే ఉంటావు," అని ఆమె ముఖం మీదకి వంగి చాలా కఠినంగా అన్నాడు. అతని గొంతులోని అధికారం ఆమెను భయభ్రాంతులకు గురిచేసింది.
"లేదు! నేను ఇక్కడ ఉండను! మీరు రాక్షసులు... నా జీవితం నాశనం చేశారు. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. మా నాన్నకి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టడు," అని ఏడుస్తూనే కాస్త ధైర్యం తెచ్చుకుని అరిచింది అరుణ.
ఆ మాట వినగానే రాజ్వీర్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. ఆమె దవడను మరింత గట్టిగా నొక్కుతూ, "నాన్న? అన్నయ్య? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్లు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నోరు మూసుకుని నేను చెప్పినట్టు వినాలి. నువ్వు ఒక్క అడుగు ఈ గది దాటి బయటకు వెళ్లాలని చూసినా... రేపు ఉదయం వాళ్ళిద్దరి శవాలు నీ ముందుంటాయి. అర్థమైందా?" అని భయంకరంగా గర్జించాడు.
ఆ బెదిరింపుకు అరుణ గుండె ఆగినంత పనైంది. వాళ్ళ కుటుంబం అంటే ఆమెకు ప్రాణం. వాళ్ళకి ఏమైనా అయితే తను తట్టుకోలేదు. రాజ్వీర్ కళ్లలోకి చూసింది. ఆ కళ్లలో కనికరం లేదు, కచ్చితంగా తను చెప్పింది చేస్తాడని ఆమెకు అర్థమైంది. ఆమె ప్రతిఘటన అంతా కన్నీరుగా మారిపోయింది. ఏడుస్తూ తల ఊపింది.
రాజ్వీర్ ఆమెను వదిలేశాడు. "గుడ్. వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు. కబోర్డ్ లో నీకోసం బట్టలున్నాయి. అవి వేసుకుని రెడీగా ఉండు. రాత్రికి నేను వస్తాను," అని చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా కఠినంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అతను వెళ్ళగానే అరుణ నేల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. తన జీవితం ఇలా ఒక చీకటి గదిలో బందీ అయిపోయినందుకు, తన వాళ్ళను కూడా చూడలేని పరిస్థితి వచ్చినందుకు కుమిలిపోయింది.
రాత్రి పది గంటలవుతోంది.
అరుణ ఆ పెద్ద గదిలో ఒక మూల కింద కూర్చుని, మోకాళ్లలో తల దాచుకుని ఏడుస్తూనే ఉంది. రాజ్వీర్ చెప్పిన ఏ బట్టలు ఆమె వేసుకోలేదు. తాను వేసుకున్న సాధారణమైన చుడీదార్ లోనే వణుకుతూ కూర్చుంది. అప్పుడే తలుపు తెరుచుకున్న శబ్దం.
రాజ్వీర్ లోపలికి వచ్చాడు. కోట్ తీసి సోఫా మీద విసిరేశాడు. టై లూజ్ చేస్తూ గది చుట్టూ చూశాడు. మూలన ఏడుస్తూ కూర్చున్న అరుణ కనిపించింది. ఆమె తాను చెప్పిన బట్టలు వేసుకోకపోవడం చూసి అతని కళ్లు తీవ్రంగా మారాయి. కోపంగా ఆమె దగ్గరికి వెళ్లాడు.
అతని అడుగుల చప్పుడుకి అరుణ తల పైకెత్తి చూసింది. అతను వస్తుంటే భయంతో వెనక్కి జరగడానికి ప్రయత్నించింది, కానీ వెనక గోడ ఉంది.
"నేను చెప్పింది నీకు చెవికి ఎక్కలేదా? నిన్ను రెడీగా ఉండమన్నాను కదా?" అని అరుస్తూ, ఆమె చేయి పట్టుకుని ఒకే ఒక్క ఉదుటున పైకి లాగాడు.
ఆ లాగడానికి ఆమె గాల్లోకి లేచి అతని కఠినమైన ఛాతికి బలంగా గుద్దుకుంది. "ప్లీజ్... వదిలేయండి... నాకు భయంగా ఉంది," అని ఏడుస్తూ అతని ఛాతి మీద చేతులు వేసి నెట్టడానికి ప్రయత్నించింది.
కానీ రాజ్వీర్ ఆమె చేతులను పట్టుకుని వెనక్కి విరిచి తన ఒక చేత్తో లాక్ చేశాడు. మరో చేత్తో ఆమె నడుము పట్టుకుని తన వైపుకి బలంగా లాక్కున్నాడు. వారిద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా లేదు. ఆమె వణుకుతున్న శరీరం అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఆమె భయం, ఆమె ఏడుపు చూస్తుంటే అతనికి జాలి కలగకపోగా, ఆమెను మరింత సొంతం చేసుకోవాలనే పిచ్చి ఆవేశం కలుగుతోంది.
"భయంగా ఉందా? ఈ భయం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నేను చెప్పినట్టు వినకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి," అంటూ తన ముఖాన్ని ఆమె మెడ దగ్గరికి తీసుకువెళ్లాడు.
"వద్దూ..." అని అరుస్తూ అరుణ తల పక్కకు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతను తన బలమైన చేతివేళ్లతో ఆమె జుట్టును వెనక్కి లాగి పట్టుకుని, ఆమె మెడను తన పెదవులకు అనువుగా మార్చుకున్నాడు. ఎంతో సున్నితమైన ఆమె మెడ మీద చాలా హార్ష్ గా, వేడిగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. అతని పెదవులు ఆమె చర్మాన్ని కరుస్తున్నాయి. అరుణ నొప్పితో విలవిలలాడిపోయింది. కళ్ల నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి.
"నన్ను వదిలేయండి దేవుడా... ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు?" అని రోదిస్తూనే ఉంది.
రాజ్వీర్ ఆమె ఏడుపును పట్టించుకోలేదు. ఆమె మెడ నుంచి పైకి వచ్చి, ఏడుపుతో వణుకుతున్న ఆమె పెదవులను చూశాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె పెదవులపై తన పెదవులను బలంగా ఆన్చాడు. అది ఒక ముద్దు కాదు, ఒక ఆధిపత్య పోరు. ఆమె పెదవులను క్రూరంగా శాసిస్తున్నాడు. ఆమె ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అతని పట్టు విడిపించుకోవడానికి తన చేతులతో అతని వీపు మీద కొడుతోంది, గోళ్లతో గీరుతోంది. కానీ ఏనుగు లాంటి ఆ మనిషి ముందు ఆమె బలం ఒక చీమ లాంటిది.
చాలా సేపటి తర్వాత ఆమెకు ఊపిరి ఆడే అవకాశం ఇస్తూ పెదవులు విడిచాడు. అరుణ రొప్పుతూ, కన్నీళ్లతో అతని ఛాతి మీద వాలిపోయింది. ఆమెలో ఇక ప్రతిఘటించే శక్తి మిగలలేదు. రాజ్వీర్ ఆమెను అలాగే ఎత్తుకుని వెళ్లి ఆ పెద్ద మంచం మీద పడేశాడు. ఆ రాత్రి కూడా ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా, ఆమె కన్నీళ్లను లెక్కచేయకుండా ఆ రాక్షసుడు ఆమెను తన గుప్పిట్లో బంధించాడు. తన కోరిక తీరేదాకా ఆమెను ఒక ఆటబొమ్మలా వాడుకున్నాడు.
అర్ధరాత్రి దాటింది.
అరుణ అలిసిపోయి, కన్నీళ్లతోనే నిద్రలోకి జారుకుంది. కానీ రాజ్వీర్ కి మాత్రం నిద్ర పట్టలేదు. తన పక్కన భయంతో ముడుచుకుని పడుకున్న అరుణ వైపు చూశాడు. అతని మనసులో ఎన్నో ఏళ్ల నుంచి రగులుతున్న ఒక అగ్నిపర్వతం చల్లారినట్లు అనిపించింది. ఆమెను తన చేతుల్లో బంధించి పడుకున్నప్పుడు అతనికి ఎప్పుడూ లేని ఒక వింతైన ప్రశాంతత దొరుకుతోంది. ఇన్నాళ్లు ఒక మృగంలా బతికిన అతనికి, ఆమె స్పర్శ ఒక తెలియని స్వాంతన ఇస్తోంది. తన వెతుకులాట ముగిసిందని అతనికి తెలుసు. కానీ, ఆ విషయం ఆమెకు తెలియనివ్వకూడదు. ఎందుకంటే, గతం తాలూకు చేదు నిజాలు, పగ, ప్రతీకారం ఇంకా నెరవేరలేదు. ప్రస్తుతానికి ఆమె తనకు దొరికిన ఒక బందీ మాత్రమే.
నెమ్మదిగా తన చెయ్యి చాచి, నిద్రలో ఉన్న అరుణ నడుము చుట్టూ వేసి, తన వైపుకు లాక్కుని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు రాజ్వీర్. ఆ భయంకరమైన కోటలో, ఆ రాక్షసుడి కౌగిలిలో అరుణ ఒక చిక్కుకున్న పక్షిలా మారిపోయింది.
ఉదయం తొమ్మిది గంటలవుతోంది. సూర్య కిరణాలు ఆ విశాలమైన గదిలోకి తొంగి చూస్తున్నా, అరుణ మనసులో మాత్రం అంతులేని అంధకారం అలుముకుని ఉంది.
ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒళ్లంతా నొప్పులు. రాత్రి జరిగిన పరిణామాలు గుర్తుకు రాగానే ఆమె గుండె తరుక్కుపోయింది. పక్కన చూసేసరికి రాజ్వీర్ లేడు. బహుశా ఉదయాన్నే లేచి వెళ్లిపోయి ఉంటాడు. మంచం మీద నుంచి కిందకు దిగడానికి కూడా ఆమెకు ఓపిక లేదు. ఒక రాక్షసుడి చెరలో తన బతుకు ఇలా అయిపోయిందేమిటి అని తలచుకుంటూ, మోకాళ్ల మధ్య తల పెట్టుకుని కుమిలికుమిలి ఏడుస్తోంది. తన నాన్న, అన్నయ్య గుర్తుకు వస్తున్నారు. వాళ్ళు తనకోసం ఎంతగా వెతుకుతున్నారో అని ఊహించుకుంటే ఆమెకు పిచ్చెక్కిపోతున్నట్లు ఉంది.
Comments